(మెట్రో న్యూస్):
- ఎకరానికి 30 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి
- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు
ఎల్ నినో ప్రభావంతో ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలించారు.మునగాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.పంటలు ఎండిపోవడంతో సాగు చేసిన వరి పొలాల్లో పశువులకు మేత మేపాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ అవసరాల కోసం నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూట దశలవారీగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రకృతి వైపరీత్యాలు, కరువు పరిస్థితుల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని, పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.ఎండిన పంటలకు ఎకరాకు 25వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుల సంఘం అధ్యక్షులుకార్యదర్శి చంద్రయ్య,స్టాలిన్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు స్వరాజ్యం, కలకోవా సర్పంచ్ వేంకటాద్రి, మండల కమిటీ సభ్యులు కృష్ణ రీడ్డీ, నాయకులు సుందరయ్య, శివాజీ తదితర రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.