Take a fresh look at your lifestyle.

ర‌ష్యా దాడి.. 6 ల‌క్ష‌ల మంది అంధ‌కారంలో: జెలెన్‌స్కీ

0 13

క్షిప‌ణులు, డ్రోన్ల‌తో ర‌ష్యా విరుచుకుప‌డింది. దీంతో ఉక్రెయిన్‌లో సుమారు ఆరు ల‌క్ష‌ల మంది అంధ‌కారంలోకి వెళ్లారు. దాడుల వ‌ల్ల‌ విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేకుండాపోయింద‌ని అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కీవ్‌లో ఉన్న కీల‌క‌మైన ఎన‌ర్జీ కేంద్రాన్ని అటాక్ చేశార‌న్నారు. ఖార్కీవ్ సిటీలో ఉన్న విద్యుత్తు కేంద్రాన్ని కూడా ర‌ష్యా అటాక్ చేసిన‌ట్లు జెలెన్‌స్కీ చెప్పారు. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య ఎన‌ర్జీ సీజ్‌ఫైర్ ఉన్న‌ట్లు ట్రంప్ చెప్పినా, ఆ ప్ర‌తిపాద‌న అమ‌లులో లేన‌ట్లు తెలుస్తోంది. తాజా దాడుల వ‌ల్ల కీవ్‌లో ముగ్గురు మృతిచెందారు. మ‌రో 21 మంది గాయ‌ప‌డిన‌ట్లు ఉక్రెయిన్ ఎమ‌ర్జెన్సీ శాఖ డీఎస్ఎస్ఎస్ తెలిపింది.

కీవ్‌, ఖార్కీవ్‌లో ఉక్రెయిన్ మిలిట‌రీ వాడే క‌మ్యూనికేష‌న్స్‌, ఎన‌ర్జీ కేంద్రాల్ని దాడి చేసిన‌ట్ల ర‌క్ష‌ణ ర‌క్ష‌ణ శాఖ పేర్కొన్న‌ది. ర‌ష్యాలోని అనేక ప్రాంతాల్లో సుమారు 902 ఉక్రెయిన్ డ్రోన్ల‌ను కూల్చిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ చెప్పింది. రాత్రికి రాత్రే ర‌ష్యా సుమారు 39 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిప‌ణుల‌తో పాటు 128 డ్రోన్లు ఫైర్ చేసిన‌ట్లు ఉక్రెయిన్ వైమానిక ద‌ళం వెల్ల‌డించింది.అయితే నాలుగు మిస్సైళ్ల‌తో పాటు 115 డ్రోన్ల‌ను కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.