Take a fresh look at your lifestyle.

శరన్నవరాత్రుల్లో 9 రూపాల్లో అమ్మవారు ఒక్కో రూపం వెనుక ఉన్న విశిష్టత

0 56

దేవీ నవరాత్రుల్లో ఆదిశక్తి అమ్మవారికి తొమ్మిది రూపాలుగా నవ దుర్గా పూజ దర్శనమిస్తారు. నవదుర్గలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ధైర్యం, జ్ఞానం, శాంతి, శ్రేయస్సు కలుగుతుందని భక్తుల నమ్మకం.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభం కానున్న దేవి నవరాత్రులు! శక్తి ఆరాధనకు శ్రేష్ఠమైన శరన్నవరాత్రులు! నవదుర్గలుగా తొమ్మిది రూపాల్లో పూజలందుకునే ఆదిశక్తి! అభీష్ట సిద్ధిని కలిగించే నవదుర్గల ఆరాధన
నవదుర్గల విశిష్టత
దేవీ నవరాత్రుల్లో ఆది శక్తిని తొమ్మిది రూపాలుగా పూజించటం జరుగుతుంది ఇవే! ఈ స్వరూపాలే నవదుర్గలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ తొమ్మిది రూపాలను శ్రద్ధాభక్తులతో పూజిస్తే సకల విజయాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అసలు ఇంతకూ ఎవరీ నవదుర్గలు? ఆ స్వరూపాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
ప్రథమ రూపం – శైలపుత్రి విశిష్టత
పర్వతరాజైన హిమవంతుని కుమార్తె పార్వతి దేవిని శైలపుత్రి అంటారు. ఈ అమ్మ వారినే గిరిజ అని, హైమవతి అని కూడా పిలుస్తారు! ఈ తల్లి ఒక చేతిలో శూలం మరొక చేతిలో కమలధరించి ఉంటుంది! ఈమె వృషభాన్ని వాహనంగా కలిగి ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చగల తల్లి అయిన శైలపుత్రిని పూజిస్తే స్థైర్యం, ధైర్యం కలుగుతాయని విశ్వాసం.
ద్వితీయ రూపం- బ్రహ్మచారిణి విశిష్టత
ఆదిశక్తి ఈ స్వరూపం తపస్సును ఆచరించే రూపం. ఈ అమ్మ వారిని తపశ్చారణి అని అంటారు! ఈ తల్లి తన కుడి చేతిలో జప మాల, ఎడమ చేతిలో కమండలంతో శ్వేత వస్తలను ధరించి ఉంటుంది! జ్ఞాన దాయిని, మెక్ష ప్రసాదిని అయిన బ్రహ్మచారిణి ఆరాధిస్తే జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయని విశ్వాసం.
తృతీయ రూపం- చంద్రఘంట విశిష్టత
ఆదిశక్తి ఈ స్వరూపంలో దర్శనమిచ్చే జగదాంబ సింహ వాహిని. ఈ తల్లి ధనుస్సు, బాణం గద, శూలం, పాశం మొదలగు ఆయుధాలు, పద్మ కమండలం, అభయ, వరద హస్తాలతో పది చేతులలో కలిగి ఉంటుంది. నవరాత్రుల్లో జగదాంబను చంద్రఘంట స్వరూపంలో పూజిస్తే ఆ తల్లి దైర్యాన్ని వీరత్వాన్ని సకలాభిష్టాలను నెర వేరుస్తుందని విశ్వాసం.
చతుర్థ రూపం – కుష్మాండ స్వరూపం విశిష్టత
తన మందహాసంతో విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి స్వరూపమే ఈ కూష్మాం! గుమ్మడి రూపంలో భూమండలావ్ని కల్పించిన తల్లి ఈ జగదాం! ఈ తల్లి తన అమృత హస్తాల్లో చక్రం, గద, ధనుస్సు, బాణం మొదలగు ఆయుధాలను, కమండలం, అమృత కలశం, జపమాల, పద్మంలను ధరించి ఉంటుంది. ఈ కుష్మాండ దేవి తనను ఆరాధించిన భక్తులకు ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
పంచమ రూపం – స్కంధమాత విశిష్టత
శరన్నవరాత్రుల్లో ఆదిశక్తిని స్కందమాత స్వరూపంలో కుమార స్వామి తల్లిగా, సింహవాహినిగా, అష్టభుజ దేవిగా ఆరాధిస్తారు! ఈ తల్లి తనను ఆశ్రయించిన భక్తులకు మోన్ని, జ్ఞానాన్ని, శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఈ మాతను కొలిస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.