
తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనం పై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.


సింహం ధైర్యం, పరాక్రమం, తేజస్సు, గంభీరతలకు ప్రతీక. దుష్టశిక్షణ, శిష్టరక్షణ సంకల్పాన్ని చాటుతూ మలయప్పస్వామివారు సింహ వాహనాన్ని అధిరోహించారు. యోగ నరసింహస్వామి అలంకారంలో స్వామివారి దివ్యదర్శనం భక్తులకు నిర్భయత్వం, ఆత్మవిశ్వాసం, ధర్మమార్గంలో నడిచే స్ఫూర్తిని అందించింది.


ఈ వాహనసేవ చాటిచెప్పింది.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జానకిదేవి, రంగశ్రీ, శాంత రామ్, సీవీఎస్‌వో కే.వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.