Take a fresh look at your lifestyle.

మర్రి జనార్ధన్ రెడ్డిపై కేసు నమోదు

0 8
Case registered against Marri Janardhan Reddy
  • నాగర్‌కర్నూల్ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ నేతల ధర్నా
  • విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు
  • జనార్దన్ రెడ్డితో పాటు మరో 38 మందిపై కేసు నమోదు

బీఆర్ఎస్ నేత, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే… నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిన్న ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో సాధారణ ప్రజలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం వీరు అనుమతి లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రవేశించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ పాత్లావత్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.