(మెట్రో న్యూస్):
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అమ్రాబాద్ మండలంలోని కల్మలోని పల్లి గ్రామంలో ఎండిపోయిన పత్తి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అమ్రాబాద్ మండల కార్యదర్శి ఎస్ మల్లేష్ సిఐటియు జిల్లా నాయకులు, జి.పర్వతాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ ని నో ప్రభావం వలన వర్షాలు పడక పత్తి పంటలు ఎండిపోయి పెట్టినటువంటి పెట్టుబడి రాక రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని,ఈ కరువులో ప్రభుత్వము రైతులను ఆదుకొని ఒక్క ఎకరాకు 25వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలు బాగా పడితే ఒక్క ఎకరాకు 10 కింటలు వచ్చే పత్తి ప్రస్తుతము రెండు కింటాలు మూడు క్వింటాళ్లు వస్తుందని, కాబట్టి ప్రభుత్వము రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున అమ్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ చెన్న కిష్టయ్య, పి.బాలకృష్ణయ్య, ఎన్.పర్వతాలు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సిహెచ్. బాలయ్య,ఏ.మధు, ఎం. పృధ్వి రాజు, దాసరి బాలస్వామి, ఎన్. శంకరయ్య, కే.జనార్ధన్, కే. కాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.