Take a fresh look at your lifestyle.

భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ అంతరాయానికి వ్యతిరేకంగా ధర్నా రాస్తారోకో

0 18

మెట్రో న్యూస్

సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున ధర్నా రాస్తరోకో కార్యక్రమం నిర్మించారు .ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరు కాలం కష్టంచి పండిస్తున్న పంటలకు సరైన కరెంటు ఇవ్వకపోవడంతో పంటలు ఎండి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పంటలకు అవసరమైన సమయంలో నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులలో తరచూ అంతరాయం ఏర్పడడంతో పాటు లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా వేధిస్తుందని దీంతో బోరు మోటారు సైతం కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బోర్డు ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం పడుతుందని రైతులు అన్నారు.మరోవైపు పొట్ట దశకు చేరుకున్న వరి పంటకు సకాలంలో నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని కీలకమైన దశలో విద్యుత్ అందకపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించి రైతులను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు భారతీయ కిషన్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.