Take a fresh look at your lifestyle.

ఏడాదిలోపే ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణం

0 158

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • కాంట్రాక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు
  • గాజుల‌రామారంలో ట‌వ‌ర్స్‌కు శంకుస్థాప‌న‌
  • హాజ‌రైన హౌసింగ్ మంత్రి పొంగులేటి, శ్రీ‌ధ‌ర్‌బాబు

క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త ప్ర‌యోగాత్మ‌కంగా నిర్మిస్తున్న ల‌క్ష ఇళ్ల‌ ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణాల‌ను పార‌ద‌ర్శ‌కంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా అందించేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా ఏడాది గ‌డువును కాంట్రాక్ట‌ర్ల‌కు నిర్ధేశించామ‌ని అయితే ఒక నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 ల‌క్ష‌లు, రెండు నెల‌ల ముందుగా పూర్తి చేస్తే రూ. 90 ల‌క్ష‌లు ప్రోత్సాహ‌క బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని చెప్పామ‌ని వివ‌రించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో మంగ‌ళ‌వారం ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు స‌హ‌చ‌ర మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ఎమ్మెల్యే కే.పీ, వివేకానంద, ప‌లువురు ల‌బ్దిదారుల‌తో క‌లిసి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్ల కోసం 7,000 మందికి పైగా దరఖాస్తులు అందగా, పరిశీలన అనంతరం 5,218 మంది అర్హులుగా తేలారని అర్హులైన వారిలో లబ్ధిదారుల ఎంపికను బహిరంగంగా లక్కీ డ్రా ద్వారా చేపట్టి, 480 మంది లబ్ధిదారులను తుది జాబితాలో ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేటాయించిన ఇళ్లతో కార్యక్రమం ముగియదని, మరో మూడు విడతల్లోనూ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.