Take a fresh look at your lifestyle.

12వ జాతీయ లోక్ అదాలత్..! జిల్లా ఎస్పీ జానకి

0 3

జాతీయ లోక్ అదాలత్‌ను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి బుధవారం సూచనలు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకుని, రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డి. జానకి సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రాజీ పడదగిన వివాదాలను ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని తెలిపారు.
దీనివల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి, ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, విద్యుత్ చార్జీలకు సంబంధించిన కేసులు, సైబర్ సంబంధిత రాజీ పడదగిన కేసులు తదితర కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకుని ప్రశాంతమైన, స్నేహపూర్వక జీవితాన్ని కొనసాగించాలని ఎస్పీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.