Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే — రాణి రుద్రమ రెడ్డి

0 5

మెట్రోన్యూస్ :

ఈరోజు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో *భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మాట్లాడుతూ…
“సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరుపురాని, మరుగునపరచలేని చారిత్రక ఘట్టం. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోకి వచ్చిన రోజును ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ గా గౌరవించడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత.
సెప్టెంబర్ 17ను ‘విలీన దినం’, ‘ప్రజా పాలన దినం’ అంటూ పేర్లు మార్చినంత మాత్రాన చరిత్ర మారదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చారిత్రక దినోత్సవం అసలు స్ఫూర్తిని మరుగునపరచడం ప్రజా పాలన కాదు, అది చరిత్రపై రాజకీయ ప్రయోగం అని అన్నారు,
సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని సెప్టెంబర్ 17 చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం, ఒకే రాజకీయ సిద్ధాంతానికి కట్టిపడేయడం మానుకోవాలి.” అని అన్నారు.
అనంతరం *బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ…
“హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం రెండూ ఒకటే కావు. వాటి లక్ష్యాలు, రాజకీయ నేపథ్యం, కాలపరిమితి, అంతిమ లక్ష్యాలు వేర్వేరు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోకి వచ్చిన వాస్తవాన్ని ఎవరూ చెరిపివేయలేరు.
సెప్టెంబర్ 17 తరువాత కూడా కమ్యూనిస్టు సాయుధ పోరాటం కొనసాగింది. 1950-51లో కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు స్టాలిన్‌తో చర్చలు జరిపిన అంశాలు చరిత్రలో ఉన్నాయి. తమకు అనుకూలమైన చరిత్రను మాత్రమే చెప్పి, అసౌకర్యంగా ఉన్న చరిత్రను పాతిపెట్టే రోజులు పోయాయని అన్నారు,
హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం రెండింటి చరిత్రను వేర్వేరుగా, వాస్తవ ఆధారాలతో పాఠ్యాంశాల్లో చేర్చాలని, పరకాల, భైరాన్‌పల్లి వంటి చారిత్రక ఘటనలు, నిజాం నిరంకుశత్వం, రజాకార్ల దమనకాండను నేటి తరానికి తెలియజేయాలని అన్నారు, నిజాం రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన జాతీయవాదులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అధికారికంగా స్మరించాలి.”
“తెలంగాణ విమోచన చరిత్ర ఎవరి సొత్తూ కాదు. అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చరిత్ర. చరిత్రను చరిత్రగానే చెప్పాలి, రాజకీయ రంగులు పులమకూడదు. సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే” అని రానా ప్రతాప్ గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీలో ఫ్లోర్ లీడర్ 28th వార్డ్ కౌన్సిలర్ జూలూరి రోజా రాణి,రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు గడ్డం ఆంజనేయులు,మాజీ మండల అధ్యక్షులు అబోతు రాజు యాదవ్,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంగేమ్ శంకర్,నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబెర్ మహేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు అంబేత్కర్ నల్లబెల్లి అధ్యక్షులు తడక వినయ్ గౌడ్, చెన్నరావుపేట అధ్యక్షులు శేఖర్, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి అచ్చ దయాకర్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, ఎర్ర రాజు,బీజేపీ పట్టణ నాయకులు విజయ్ సింగ్, కాసుల నాగేంద్ర బాబు, అల్లం నిఖిల్ ,ముత్యాల శ్రీనివాస్, సామల ప్రవీణ్ కుమార్, నూనె రంజిత్,అజీమ్, అనిల్,బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.