Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు నాణ్యమైన ఫౌండేషన్ విద్య అందించడమే లక్ష్యం ll కరస్పాండెంట్ నరాల సంతోష్

0 26

మెట్రో న్యూస్

రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని హంసినీ హైస్కూల్ ఆధ్వర్యంలో IIT, NEET, CIVILS వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను చిన్ననాటి నుంచే సన్నద్ధం చేసే దిశగా నూతన ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్నీ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా IIT–NEET–CIVILS పుస్తకాన్ని స్కూల్ కరస్పాండెంట్ నరాల సంతోష్ రూపొందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షలపై అవగాహన కల్పించడం, ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాది ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయవచ్చన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం అందించడం అవసరమని పేర్కొన్నారు.వేములవాడలో తొలిసారిగా IIT, NEET, CIVILS కు సంబంధించి ఫౌండేషన్ విద్యను అందించే మొదటి విద్యా సంస్థ గా HAMSINI స్కూల్ నిలవడం అభినందనీయమన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ , TRSMA రాష్ట ప్రెసిడెంట్ యాదగిరి శేఖర్ రావు, డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ, TRSMA జిల్లా ప్రెసిడెంట్ నాగుల శ్రీనివాస్, తల్లిదండ్రులు, విద్యార్థులు,టీచర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.