Take a fresh look at your lifestyle.

భట్టితో కొండా మురళి, భేటీ.

0 13

భట్టితో కొండా మురళి, భేటీ.

హైదరాబాద్ : మెట్రో న్యూస్
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో రేగిన వ్యాఖ్యల దుమారం కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గురువారం భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
​టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ సిఫార్సు నేపథ్యంలోనే ఈ భేటీ జరగడం గమనార్హం.
పార్టీలోని ముదిరిన విబేధాలు, క్రమశిక్షణా కమిటీ సీరియస్ అయిన తీరుపై భట్టి వద్ద కొండా మురళి తన అభిప్రాయాలను వ్యక్తపరిచినట్లు తెలిసింది.
క్రమశిక్షణా కమిటీ నిర్ణయం వెలువడే వరకు తాను ఏమీ మాట్లాడనని భేటీ అనంతరం కొండా మురళి మీడియా కు చెప్పారు. పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ల నాయకత్వం పై విశ్వాసం ఉందని తాము కాంగ్రెస్ ను వీడే ప్రసక్తి లేదని తెలిపారు తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తాము బాద్యులం కామన్నారు.

Leave A Reply

Your email address will not be published.