హైదరాబాద్ : మెట్రో న్యూస్
ఇటీవల ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమితులైన మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను శనివారం కలిశారు.
ఈ సందర్భంగా గద్వాల విజయలక్ష్మి కి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలియజేసి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన పురోగతికి గద్వాల విజయలక్ష్మి తన అనుభవాన్ని వినియోగించాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.