Take a fresh look at your lifestyle.

సైబర్ క్రైమ్ రిసోర్స్ పర్సన్ రమేష్

0 2

హన్మకొండ జిల్లా, పరకాల పట్టణ కేంద్రంలోనీ ఆర్.యు.ఏ. భవన్ లో శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కల్లెపు శోభారాణి ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సహకారంతో స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యాపారులకు, యువకులకు, విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పైన మరియు సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగ మెప్మా ఎ.డి.ఎం.సి. సతీష్, ఎన్.ఎస్.ఎస్. కో’ఆర్డినేటర్ సర్దార్, జీ.జె.సి. ఇంచార్జ్ లత, స్టూడెంట్ కౌన్సిలర్ పద్మ, సైబర్ క్రైమ్ రిసోర్స్ పర్సన్ రమేష్ మరియు ఎఫ్.ఎల్.సి. కో’ఆర్డినేటర్ భాస్కర చారి హాజరయ్యారు. సైబర్ క్రైమ్ రిసోర్స్ పర్సన్ మాట్లాడుతు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగ, అప్రమత్తంగా ఉండాలి. యువకులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సైబర్ నేరగాళ్ళ వలలో పడి బారి మొత్తంలో డబ్బులు నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు మోసపూరితమైన ఆప్ లు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించి క్రమ క్రమగా తమ బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులను కజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ లు లాంటివి కూడా ఎక్కువయ్యాయి. తమ కుటుంబ సభ్యులలొ ఒకరు ఆపదలో ఉన్నారని లేదా నేరం చేసి మాకు దొరికిపోయాడు కాబట్టి వెంటనే ఎక్కువమొత్తంలో మాకు డబ్బులు పంపిస్తేనే వదిలేస్తమని బయబ్రాంతులకు గురిచేస్థునారు అలాంటి సమయంలో బాధితులు కంగారు పడకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి తమని తాము కాపాడుకోవచ్చు, రకరకాల ఆప్ లలో గేమ్స్ ఆడి డబ్బులు పోయిన విషాదంలో అనంతరం బయంతో, అవమానంతో ఎవరికి చెప్పుకోలేక ఎదురైన సమస్యను పరీష్కరించుకోలేక ఆత్మహత్య చేసుకొని తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

కాబట్టి ప్రతిఒక్కరు అన్ని విషయాల్లో జాగ్రత్తగ ఉండాలి. సైబర్ మోసాల పట్ల బ్యాంక్ ఖాతాదారులందరు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 గోల్డెన్ అవర్ ని. గుర్తుపెట్టుకోవాలీ మరియు డబ్బు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో దానినీ దాచుకోవడం ఎంత ముఖ్యమో, కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని బ్యాంకు సంబంధిత ఓటీపీ, పిన్ మరియు వ్యక్తిగత అకౌంట్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని, లింకులను నొక్కడం ఫార్వర్డ్ చేయడము చెయ్యకూడదని, సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టేముందు చాలా వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు గోల్డెన్ అవర్ ని గుర్తుకు చేసుకొని వెంటనే 1930 నెంబర్ కి ఉచితంగానె కాల్ చేసి న్యాయం పొందవచ్చు అన్నారు.

అనంతరం వరంగల్ జిల్లా ఎఫ్.ఎల్.సి. కో’ ఆర్డినేటర్ మాట్లాడుతు అందరు ఆర్థిక అక్షరాస్యత పైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, సామాజిక భద్రత పథకాలైన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సిబిల్ స్కోర్, సుకన్య సమృద్ధి యోజన, పి. ఎం. ఇ. జి. పి, ఎన్. బి. ఎఫ్. సి, ఫిక్సిడ్ /టర్మ్, డిపాసిట్ అకౌంట్స్, రిక్యూరింగ్ డిపాజిట్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్, బి. ఎస్.బి.డి, టాక్స్ లిబిలిటీ ఆఫ్ ఎఫ్డి /ఆర్డి ఆకౌంట్స్, అకౌంట్ ఓపెనింగ్ అండ్ హౌ టూ డూ ట్రాన్సక్షన్స్, కే. వై. సి, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇ-వాల్లేట్స్, యూ. పి. ఐ/ యూ. ఎస్. ఎస్. డి,/ఎ. ఇ. పి. ఎస్, లాకర్ ఫెసిలిటీ, లోన్ ఫెసిలిటీ, గవర్నమెంట్ స్కిమ్స్, సబ్సిడీ, గ్రీవెన్సీ రిడ్రస్స, ఆర్. బి – ఐ. ఒ. ఎస్, 2021, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా, ఎన్. ఇ. ఎఫ్. టి, ఆర్. టి. జి. ఎస్, ఐ. ఎం. పి. ఎస్, బి. బి. పి. ఎస్, ఎన్.ఇ. టి. సి ఫాస్ట్ టాగ్ పథకాల పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెప్మ సి.ఓ. లు రుక్మిణి, సుజాత, రాజు మరియు స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు, యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.