Take a fresh look at your lifestyle.

ఓం నమో భగవతే వాసుదేవాయ

0 11

హిందూ పురాణ గ్రంథాల ప్రకారం, మాత దేవకి, వాసుదేవుడు దంపతులకు మధుర నగరంలో అష్టమి తిథి భాద్రపద మాస కృష్ణ పక్షం 8వ రోజు వృషభ లగ్నం రోహిణి నక్షత్ర శుభ సమయాన అర్థరాత్రి జన్మించాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు. రాక్షస ప్రవృత్తి కలిగిన కంసుడు కారాగారంలో బంధించిన వేళ ఆ దంపతులకు పుట్టిన చిన్ని కృష్ణున్ని బృందావనంలో యజోద నందుల ఇంటికి చేర్చిన విషయం మనకు తెలుసు.

శ్రీ విష్టువు దశావతారాల్లో 8వ అవతారంగా జగన్నాథుడు జన్మించిన శుభ గడియలను కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, శతమానం, శ్రీ కృష్ణ జయంతి, శ్రీ జన్మాష్టమి, లేదా అష్టమి రోహిణి అనబడే పలు పేర్లతో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రపంచ హిందూ సమాజం నిర్వహించుకునే ఒక ముఖ్యమైన పండుగగా దీనికి ప్రాధాన్యం ఉన్నది. నిజానికి కృష్ణాష్టమి తిథి 04 సెప్టెంబర్ 2026 శుక్రవారం తెల్లవారు జామున 2:25 గంటలకు ప్రారంభమై 05 సెప్టెంబర్ 2026 శనివారం అర్ధరాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది. దీనిని గమనించిన పంచాంగకర్తలు 04 సెప్టెంబరు 2026 రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకోవాలని నిర్ణయించారు.

ప్రత్యేక పూజలు, అభిషేకాలు విష్ణుమÖర్తి ఎనిమిదవ అవతారమైన వేణుమాధవుడి జననం సందర్భంగా గోకులాష్టమి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్ర పర్వదినం రోజున బాల గోపాలుడికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేస్తారు. బాల కృష్ణుడి రూపమైన లడ్డూ గోపాలుడికి స్నానం చేయించి, నూతన వస్తలు ధరింపజేసి, పంచామృతాలు, వెన్న, తులసి దళాలు సమర్పిస్తారు. కృష్ణాష్టమి రోజు కృష్ణున్ని పూజిస్తే అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సొంతం అవుతాయని నమ్ముతారు. ఈ రోజున దేవాలయాలు లేదా గృహాల్లో చిన్ని కృష్ణుని విగ్రహాన్ని ఉయ్యాలో అమర్చి జోలపాటలు పాడుతూ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇస్కాన్ రాధా గోవింద మందిరాల్లో భక్తులంతా “హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే” నామాన్ని జపిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం కొనసాగుతున్నది. గోపాలుడి ఫోటోకు పుష్పాలతో పూజలు చేస్తూ “శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః” అనే మంత్రాన్ని 21 లేదా 54 లేదా 108 సార్లు మనసారా జపిస్తారు. పూజలో భాగంగా నల్లనయ్యకు నైవేద్యంగా అటుకుల ప్రసాదాన్ని సమర్పిస్తారు. దేశవ్యాప్తంగా అనేక కృష్ణ మందిరాలు ఉన్నప్పటికీ మహారాష్ట్రంలో విరోబా, రాజస్థాన్‌లో శ్రీనాథ్ జీ, ఉడిపిలో కృష్ణుడు, కేరళలో గురువాయురప్ప, యÖపీలో బృందావనం, తమిళనాడులా పార్థసారథి, గుజరాత్‌లో ద్వారక, ఒడిసాలో పూరీ క్షేత్రాలు ప్రత్యేక కన్నయ్య మందిరాలుగా పేరుగాంచాయి.

హైందవ ధర్మానికి సంబంధించిన జన్మాష్టమి పండుగను గొప్ప ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పర్వదినంలో భాగంగా ప్రత్యేక భజనలు,నృత్యాలు,కీర్తనలు ఆలపించడం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. శ్రీ కృష్ణుడి జీవితం, గీతోపదేశం మన జీవన ప్రయాణంలో సన్మార్గాలను బోధిస్తున్నది. కృష్ణుడి జీవితం జ్ఞానం, శాంతి,పరహిత భావనలు, ప్రేమ, భక్తి, కరుణ, సత్య మార్గం లాంటి గుణాలను బోధిస్తున్నది. పుర వీధుల్లో ఉట్లు కొట్టే పోటీలు కూడా నిర్వహిస్తారు. బాల కృష్ణుడిని పూజించడం ద్వారా కష్టనష్టాలు,దుఃఖం,దోషం, దారిద్రం తొలగిపోతాయని నమ్ముతారు.
“ఓం నమో భగవతే వాసుదేవాయ”
– “శ్రీ కృష్ణార్పణమస్తు”

Leave A Reply

Your email address will not be published.