Take a fresh look at your lifestyle.

ఢిల్లీ బహిరంగ సభకు వెంకటాపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు.

0 4

మెట్రో న్యూస్.

ములుగు జిల్లా ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఢిల్లీలో నిర్వహించనున్న ఓటు చోరీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వెంకటాపూర్ మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు అక్టోబర్ 29న ఢిల్లీకి బయలుదేరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యతపై నిర్వహించనున్న ఈ సభలో పాల్గొనేందుకు నాయకులు ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీకి బయలుదేరిన వారిలో వెంకటాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్టెకోళ్ల వెంకటేష్ యాదవ్, ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మేకల రాజేష్, ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ బూస గణేష్, వెంకటాపూర్ మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మిల్కూరి యుగేందర్, ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మార్క హరీష్, కన్నాయిగూడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోట నాగేష్ ఉన్నారు. ఢిల్లీలో నవంబర్ 1న జరగనున్న ఓటు చోరీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ములుగు జిల్లా నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు బయలుదేరడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Leave A Reply

Your email address will not be published.