Take a fresh look at your lifestyle.

2026 దీపావళి నవంబర్ 8 లేదా 9? లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం ఇదే!

0 5

దీపావళి 2026: శరన్నవరాత్రుల పండుగ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి దీపావళి పండుగ కోసమే… దీపాలు వెలిగించడం, రంగోలీల అలంకరణ, మిఠాయిలు పంచుకోవడం, లక్ష్మీ పూజ, క్రాకర్స్ కాల్చడం అంతా సందడే సందడి.

అమావాస్య ఘడియలు 2026 నవంబర్ 08 ఆదివారం 10 గంటల 37 నిముషాల నుంచి ప్రారంభమయ్యాయి
నవంబర్ 09 సోమవారం ఉదయం 11 గంటల 10 నిముషాల వరకు ఉన్నాయి

దీపావళి పండుగకు అమావాస్య ఘడియలు సూర్యాస్తమయం తర్వాత ఉండడం ప్రధానం అందుకే దీపావళి నవంబర్ 8 ఆదివారం జరుపుకోవాలి

సోమవారం సూర్యోదయం సమయానికి అమావాస్య ఘడియలు ఉండడంతో ఈ రోజు సోమావతి అమావాస్య జరుపుకుంటారు

లక్ష్మీపూజకు అనువైన సమయం?

పంచాంగం ప్రకారం  ప్రదోష కాలంలో నవంబర్ 8, 2026న జరిగే లక్ష్మీ పూజ శుభ సమయం ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వైదిక పంచాంగం  ప్రకారం, లక్ష్మీ పూజ ముహూర్తం సాయంత్రం 6.00 గంటల నుంచి రాత్రి 8.33 గంటల వరకు ఉంటుంది.  లక్ష్మీ పూజ రోజున, ఇళ్లను, దుకాణాలను శుభ్రం చేసి దీపాలు వెలిగిస్తారు. ప్రవేశ ద్వారం వద్ద రంగోలి వేస్తారు. లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించి, సుఖం, శ్రేయస్సు, జ్ఞానం, ఐశ్వర్యం కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ రోజు ముఖ్యంగా వ్యాపార వర్గానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. లక్ష్మీ పూజ సమయాలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. స్థానిక పంచాంగం , మత క్యాలెండర్ ప్రకారం తుది నిర్ధారణ చేసుకోవాలి.

దీపావళి సాంస్కృతిక ప్రాముఖ్యత

భారతీయ సంస్కృతిలో దీపావళి ఆనందం, ఆశ, సానుకూలత , నూతన ఆరంభాలకు ప్రతీక. పురాణాల ప్రకారం ఈ పండుగ శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడంతో ముడిపడి ఉంటుంది. లక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్సును కోరుకోవడానికి చిహ్నం కాగా, దీపాలు వెలిగించడం చీకటిని పారద్రోలి వెలుగును ఆహ్వానించే ఒక మార్గం. దీపావళి సమయంలో, ఇళ్లను శుభ్రపరచడం, రంగోలీలతో అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సామాజిక కుటుంబ బంధాలు బలపడతాయి. ఈ పండుగ కేవలం మతపరమైన ఆచారాలకే పరిమితం కాదు, ఒకరితో ఒకరు సంతోషాన్ని పంచుకోవడం,  అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం అనే సందేశాన్ని కూడా అందిస్తుంది.

దీపావళికి సిద్ధమవ్వండి!

దీపావళి సందర్భంగా ఇల్లు శుభ్రం చేసుకోవడం, దీపాలు అలంకరించుకోవడం, చిరుతిళ్లు తయారు చేసుకోవడం, బంధువులను కలవడం వంటి పనులు మొదలవుతాయి. లక్ష్మీ పూజ ముహూర్తం కోసం మీ నగర పంచాంగాన్ని చూసుకొని, పూజకు ప్రణాళిక వేసుకోండి. మట్టి దీపాలను ఉపయోగించడం, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం, పేదల ఆనందంలో పాలుపంచుకోవడం ద్వారా పర్యావరణహితమైన దీపావళిని జరుపుకుంటూ, ఈ పండుగ నిజమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. ఎందుకంటే దీపావళి కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు, చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఒక ముఖ్యమైన పండుగ.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Leave A Reply

Your email address will not be published.