Take a fresh look at your lifestyle.

సింగరేణి బావుల్లో దుర్గామాత నవరాత్రి పూజలు.

0 15

(మెట్రో న్యూస్)

గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి వన్ ఇంక్లైన్, సిక్స్ ఇంక్లైన్ బొగ్గు బావుల్లో దుర్గామాత దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో దుర్గామాతను దర్శించుకుని ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని, దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపతో భూపాలపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు బావుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కష్టానికి తగిన గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సంతోషంగా,సురక్షితంగా ఉండాలని, సింగరేణి ప్రాంతంలో సుఖశాంతులు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు, సింగరేణి కార్మికులకు దుర్గామాత నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.