Take a fresh look at your lifestyle.

నాయీబ్రాహ్మణుల ప్రతి షాపులో ఎమ్మెల్యే నాయిని చిత్రపటం

0 25

మెట్రో న్యూస్

నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నాయీబ్రాహ్మణ సోదరులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు.

బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి నాయీబ్రాహ్మణ షాప్, సెలూన్‌లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా సెలూన్లలో ఏర్పాటు చేయనున్న ఎమ్మెల్యే చిత్రపటాలను నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. తమ వృత్తికి గౌరవం, కుటుంబాలకు భరోసా కల్పిస్తూ నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి అండగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొత్తపెల్లి శ్రీనివాస్, నాగవెల్లి సురేష్ కుమార్, తూముల సాంబయ్య, కురిమిళ్ల రమేష్, నాగవెల్లి కృష్ణ, సూరయ్య, కోడెపాక రాజేందర్, నడిగోటి నవీన్, నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు జంపాల యుగేందర్, మొగిలిచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.