జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల
ఇబ్రహీంపట్నం, నవంబర్ 02 (మెట్రో న్యూస్) : వర్షకొండ గ్రామంలో నూతనంగా పాక్స్ (PACS) కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ కల్వకుంట్ల జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న పాక్స్ కేంద్రాల పరిధిలో వర్షకొండ గ్రామాన్ని కూడా చేర్చి, ఇక్కడ పాక్స్ కేంద్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంతో పాటు పరిసర గ్రామాల రైతులు పాక్స్ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామంలోనే పాక్స్ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నూతన పాక్స్ కేంద్రం మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరినట్లు ఆయన తెలిపారు.