Take a fresh look at your lifestyle.

ఎస్పీని కలిసిన టి జె ఎ నూతన కమిటి.

0 11

(మెట్రో ఈవినింగ్స్):

టి జె ఎ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్  జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు గురువారం ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్నాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందించారు, ఈ సందర్భంగా ఎస్పీ జర్నలిస్ట్
అసోసియేషన్  నూతన కార్యవర్గ  సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎస్పీ తన ఛాంబర్ లో టీజేఏ కమిటీ సభ్యులతో కాసేపు ముచ్చటించటం తోపాటు జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు, మీడియా భద్రత, సమాచార అందుబాటు వంటి అంశాలపై  ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో నిజాలను నిర్భయంగా ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. చట్ట పరిధిలో జర్నలిస్టులు తమ విధులు నిర్వర్తించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మీడియా, పోలీస్ శాఖ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా నూతన కమిటీకి ఆయన అభినందనలతో పాటు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి సమస్య ఉత్పన్నమైన వెంటనే తన ద్రుష్టి కి తీసుకురావాలని, సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ నూతన కమిటీ ఎస్పీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు  కృతజ్ఞతలు తెలియజేసారు. ములుగు జిల్లా ఎస్పీ ని కలసిన వారిలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా  అధ్యక్షుడు బేతి సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎనగందుల కొమురయ్య, ఉపాధ్యక్షులు చల్లగురుగుల రాజు,కోశాధికారి సంగ రంజిత్  కుమార్,సభ్యులు బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.