Take a fresh look at your lifestyle.

జాతీయవాదులు ఏకం కావాలి

0 4

(మెట్రో న్యూస్) :

విదేశీ భావజాలంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న శక్తులను ఎదుర్కొనేందుకు జాతీయవాదులు ఏకం కావాలని జాతీయవాదుల సంగమం స్టీరింగ్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ లో నవంబర్ 3న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నాయకులతో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం పోస్టర్ ను శనివారం జగిత్యాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్వ ఏబీవీపీ నాయకులు మ్యాన మహేష్, మురళీ, పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి, ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన కాసం వెంకటేశ్వర్లు ఇటీవల బీజేపీ కర్ణాటక రాష్ట్ర సహ ఇన్ చార్జ్ గా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో జాతీయవాదుల సంగమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో ఏబీవీపీలో పనిచేసిన పూర్వ విద్యార్థి నాయకులతో పాటు వివిధ సంస్థలలో పనిచేస్తున్న జాతీయవాదులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పూర్వ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తదితర జాతీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలిపారు. విద్యార్థి ఉద్యమాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న శక్తుల పట్ల ప్రజలను జాగృతం చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు జాతీయవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఏబీవీపీ నాయకులు ఏసీఎస్ రాజు, గండ్ర ప్రసాదరావు, సంపూర్ణచారి, ఓరుగంటి చంద్రశేఖర్, లక్ష్మారెడ్డి, జున్ను రాజేందర్, చింతల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.