Take a fresh look at your lifestyle.

రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న రైతు పక్షపాతి నరేంద్ర మోదీ

0 2

( మెట్రోన్యూస్ )

-బీజేపీ మండల అధ్యక్షులు ద్యాగ సరిన్

రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న రైతు పక్షపాతి నరేంద్ర మోదీ అని నవీపేట్ మండల బీజేపీ అధ్యక్షులు సరిన్ అన్నారు.భారతీయ జనతా పార్టీ నవీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు 24వ విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ద్యాగ సరిన్ మాట్లాడుతూ
దేశానికి అన్నం పెట్టే రైతన్న సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారన్నారు.
రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం అందిస్తూ, రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని,రైతుల కష్టాలను గుర్తించి వారికి అండగా నిలుస్తున్న ఆయన నిజమైన రైతు పక్షపాతి అని కొనియాడారు.అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు . రైతు భరోసా పథకం విషయంలో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు.రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం సరికాదు. రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు.కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి రైతుకు చేరవేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతం కోసం బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.
అదేవిధంగా భారతదేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కుమనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, జాతీయ ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మోస్రా గోపాల్, బీజేపీ జిల్లా కార్యదర్శి మైస రాధా, జిల్లా ఐటీ ఇంచార్జ్ పిల్లి శ్రీకాంత్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజల నాగభూషణం, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పుట్ట శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మంత్రి రాజేందర్ గౌడ్, సర్పంచులు గంగాధర్, సుంకరి రాజు, ఉపసర్పంచ్ సందీప్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బండారి రాజశేఖర్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు భాను గౌడ్, వార్డు మెంబర్లు భునాది నవీన్, ప్రేమ్ సింగ్, భూమయ్య తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.