Take a fresh look at your lifestyle.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి.. మూడు దశాబ్దాల కల సాకారం

0 14

1996లో చంద్రబాబు చేసిన శంకుస్థాపన.. నేడు పూర్తయిన జలయజ్ఞం

అదే హోదాలో ప్రారంభించనున్న చంద్రబాబు

కృష్ణా జలాలతో కరవు ప్రాంతాలకు ఊరట

అమరావతి, ఆగష్టు 28:

ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తయింది. కృష్ణా వరద జలాలను శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్‌లోని కొల్లంవాగు నుంచి నల్లమల కొండల కిందుగా జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తరలించే ఈ భారీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిస్థాయి వినియోగానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొట్టిపడియ వద్ద శంకుస్థాపన చేయడం ఈ ప్రాజెక్టు చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. ముఖ్యమంత్రిగా వెలుగొండ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు అదే హోదాలో ఈ నెల 31న సోమవారం నాడు ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును క్లిష్ట సమయంలో నిర్మించే బాధ్యతలు చేపట్టిన ఎం ఈ ఐ ఎల్ 11.175 కిలోమీటర్ల సొరంగాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పలు అనుబంధ నిర్మాణాలను కూడా పూర్తి చేసింది.

చంద్రబాబు శంకుస్థాపన నుంచి ప్రాజెక్టు పూర్తి వరకు

నారా చంద్రబాబు నాయుడు 1996 మార్చి 5న శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు.. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పూర్తయింది. కరవు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు భారీ జలరవాణా వ్యవస్థగా రూపుదిద్దుకుంది. శంకుస్థాపన చేసిన నాయకుడిగా చంద్రబాబు నాయుడి దీర్ఘకాలిక అభివృద్ధి దృష్టికి ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన ప్రతీకగా నిలుస్తోంది. ఎవరైతే ప్రాజెక్ట్ కు తొలుత శంఖుస్థాపన చేశారో అదే నేత ప్రాజెక్ట్ ను ప్రారంభించనుండటం విశేషం. ఆ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కింది.

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు

పూల సుబ్బయ్య 1978లో లేవనెత్తిన డిమాండ్ నుంచి 1991లో సాధ్యాసాధ్య అధ్యయనాలు, 1994లో డీపీఆర్, 1996లో చంద్రబాబు నాయుడు వేసిన శంకుస్థాపన, 2005లో ప్రస్తుత రూపంలో పనుల ప్రారంభం, 2021లో టన్నెల్–1 బ్రేక్‌త్రూ, 2024లో టన్నెల్–2 బ్రేక్‌త్రూ.. ఇలా సాగిన సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు పూర్తయింది.

చంద్రబాబు నాయుడు వేసిన పునాదికి, ప్రభుత్వాల నిరంతర కృషికి, ఇంజినీర్లు–కార్మికుల శ్రమకు, ముఖ్యంగా క్లిష్టమైన తుది దశలో ఎం ఈ ఐ ఎల్ చేపట్టిన కీలక పనులకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి ఒక సమిష్టి ఫలితంగా నిలిచింది. కృష్ణా జలాలు నల్లమల సాగర్‌కు చేరడంతో కరవు నేలలకు జలసిరులు అందించే కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

Leave A Reply

Your email address will not be published.