మెట్రో న్యూస్
> రామానుజన్ గణిత
అకాడమీ – రామచంద్రాపురం వారు నిర్వహించిన గణిత ఒలంపియాడ్ లో జయ స్కూల్ మిర్యాలగూడ నుండి 8 మంది విద్యార్థులు రెండవ లెవెల్ కు అర్హత సాధించారని కరస్పాండెంట్ జయవేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం స్థానికంగా మాట్లాడుతూ తమ పాఠశాల నుండి అన్ని పోటీ పరీక్షలకు విద్యార్థులు పాల్గొంటారని ప్రతి పరీక్షలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ ర్యాంక్ లు సాధిస్తున్నారని అన్నారు. రామానుజన్ గణిత పోటీ ఫలితాలలో
> 6వ తరగతి, డి.పార్వు, జి.విష్ణువర్ధన్
> 8వ తరగతి, ఇ. ప్రబణి శ్రీకర్
> 9వ తరగతి, యం.నిషిత, వి.మోక్షిత, ఎ.వల్లవి
> యం.డి. తూబా తన్వీర్
> 10వ తరగతి, వి.గుణశేకర్ అర్హత సాధించారని తెలిపారు.
పాఠశాలలో గణితంపై నిర్వహించే వివిధ కార్యక్రమాలు, వర్క్ షాపులు మరియు అత్యుత్తమ ప్రోగ్రామ్ ద్వారా టాలెంట్ టెస్టులలో విజయం సాధిస్తున్నారని తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, తోడ్పడిన తమ ఉపాధ్యాయ బృందాన్ని కరస్పాండెంట్ జయవేణుగోపాల్ మరియు డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి లు అభినందించారు. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు.