(మెట్రో న్యూస్) :
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జి, జగదీశ్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వలన ఇబ్బంది రాలేదని తెలంగాణకు వచ్చింది ఎల్ నినో దయ్యం కాదని తెలంగాణకు పట్టింది కాంగ్రెస్ దయ్యమని ప్రతి దానికి ఎల్ నినో అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కృష్ణా, గోదావరిలో నీళ్లు ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ లో నీళ్లు ఇస్తానికి సిద్ధంగా ఉన్న, శ్రీశైలం, ఎస్ఎల్ బిసీ లో సాగర్ లో నీళ్లు ఉన్న, సాగర్ ఎడమ కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీళ్లు ఉన్నా,కానీ కేవలం 7,000 క్యూసెక్కుల నీళ్లు ఇస్తున్నారని రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, నియోజకవర్గాలకు కాళేశ్వరం జలాలు ఎందుకివ్వడం లేదని ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లను ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
నీళ్లు ఇస్తే రైతులు పంటలు పండిస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని కారణంతో ప్రభుత్వం రైతాంగాన్ని అయోమయం, అన్యానికి గురిచేస్తుందని ఆక్షేపించారు. రెండు పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా ఇవ్వకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని గల్లా బట్టి ప్రజల్లో నిలబెట్టి నీళ్లు ఇప్పించేందుకు బిఆర్ఎస్ పార్టీ రైతాంగం పక్షాన కృషి చేస్తుందని అన్నారు. ఆయన వెంట జిల్ల బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ జడ్పిటిసిలు జీడి భిక్షం, సంజీవ నాయక్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, తదితరులు ఉన్నారు