Take a fresh look at your lifestyle.

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

0 2

మెట్రో న్యూస్

ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు కె.అనుష, రవితేజ

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ఆసక్తి చూపుతూ ప్రతిభ చాటాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు కే. అనుష, రవితేజ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ స్టేడియంలో నారాయణ స్కూల్ ప్రీమియర్ గేమ్స్‌ను వారు ప్రారంభించారు. ఈ పోటీల్లో కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, చెస్, క్యారమ్స్ తదితర క్రీడల్లో 8 టీములు పాల్గొన్నాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విజేతలకు మెమెంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం రమణ రెడ్డి, ఏజీఎం రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ నవనీత, హరిత, సంజీవ్ కుమార్, నరేష్, దివ్య, సైదులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.