Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కండి : పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

0 7

ఢిల్లీ: మెట్రో న్యూస్

అభివృద్ధిలో తెలంగాణ ఎదుగుతుందని ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని సమిష్టి కృషితో ఎదుగుతూ చరిత్ర సృష్టిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణలో డిసెంబర్ 7 8 9 తేదీల్లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ లో ఆయన మాట్లాడారు సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఒక ప్రపంచ స్థాయి నగరంగా వెలిగిందని చెప్పారు హైదరాబాదులోని ఫ్యూచర్ సిటీలో జరగనున్న సబ్మిట్ కు ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వ్యాపారస్తులు హైదరాబాద్లోని చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చి ముత్యాలు సుగంధ ద్రవ్యాలు వెండి నకాషీ కళాకృతులను కొనుగోలు చేసేవారని తెలిపారు నిజాం పాలకులు సైతం తెలంగాణలో అద్భుతమైన కట్టడాలు నిర్మించాలని తెలిపారు .

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడంలో హైదరాబాదుకు ఒక ప్రత్యేక స్థానం ఉందని సీఎం వ్యవహరించారు భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన మహానేతలను మరువద్దని అన్నారు తాను ప్రసంగించడానికి రాలేదని పెట్టుబడిదారుల అభిప్రాయాలను వినడానికి వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అభిప్రాయాలను అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెడతామని చెప్పారు ప్రభుత్వం నుంచి పెట్టుబడులకు కావలసిన ఎలాంటి సహాయ సహకారాలైన మద్దతు అందించే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా కలిగితే అందులో తెలంగాణ బాట పది శాతం గా ఉండాలని ఆయన తెలిపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ వికసితభారత లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరారు ప్రస్తుతం దసరా కర్వా చౌత్ దీపావళి పండుగలు జరుగుతున్న రోజుల్లోనే దీపావళి సమ్మిట్ తెలంగాణలో జరగడం మరో పండుగగా ఆయన తెలిపారు 700 ఏళ్ల క్రితమే కాకతీయ గణపతి చక్రవర్తి నౌకా వాణిజ్యంపై మొటిపల్లి శాసనం వేయించారని ఆయన గుర్తు చేశారు 2004 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు పీయూష్ గోయల్ తెలిపారు వికసిత భారత్ సాధించాలంటే అన్ని రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు కొన్ని రంగాల్లో హైదరాబాద్ ముందుందని ఆయన కొనియాడారు తాండూర్ కందులు నిజామాబాద్ పసుపు ఫార్మా బయోటిక్ తెలంగాణలో ఉన్నాయని తెలిపారు తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం భాగస్వామిగా ఉంటుందని తెలిపారు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంత్రులు శ్రీధర్ బాబు వాకాటి శ్రీహరి ఎంపీలు వేం నరేందర్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.