Take a fresh look at your lifestyle.

పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ.

0 3

మెట్రో న్యూస్

వరంగల్ -ఖమ్మం -నల్గొండ
పట్టభద్రుల నియోజక వర్గ ఓటరు నమోదు పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.

బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా పెండింగ్ లో ఉన్న
ఫారం 6 ,7,8 దరఖాస్తులను వారంలో పరిష్కరిస్తామని తెలిపారు . సర్ లో భాగంగా ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియ కొనసాగుతున్నదని, వివిధ కారణాల చేత
ఓటరు జాబితా నుండి తొలగించబడిన వారు తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఎస్ ఐ ఆర్ ప్రక్రియలోభాగంగా
ప్రముఖుల పేర్లు ఓటరు జాబితాలో లేకుంటే బిఎల్వోలతో పరిశీలించుకుని ఓటరరు గా నమోదు చేయించుకోవాలన్నారు.

వరంగల్- ఖమ్మం- నల్గొండ
పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు పొందేందుకు అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పునరుద్గాటించారు. పట్టభద్రుల నియోజకవర్గంలో నవంబర్ 6 లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలంటే నిబంధనల ప్రకారం దరఖాస్తుదారు 3 సంవత్సరాల క్రితం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండాలని, దరఖాస్తుతో పాటు స్వీయ ధ్రువీకరణతో కూడిన పట్టభద్రుల సర్టిఫికెట్‌, అవసరమైన ఇతర పత్రాలు సమర్పించాలని పునరుద్ఘాటించారు.
అన్ని డిగ్రీ కాలేజీలు,యూనివర్సిటీ లలో అలాగే ఉపాధ్యాయ యూనియన్ల లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు పై మరోసారి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఫారం- 18 ను పరిశీలించేందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించామని,
ఈ ఆర్వో లాగిన్ లో ఫారం 18 లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు .కొత్త యూనివర్సిటీలు 2011 వరకు యుజిసి కింద రిజిస్టర్ అయి ఉంటే ఆ యూనివర్సిటీ లు జారీ చేసిన డిగ్రీలను అనుమతిస్తామని తెలిపారు . పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదుకు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఓటరుగా నమోదు చేసుకోవాలని, లేదంటే చివరి రోజుల్లో సర్వర్ బిజీ వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్‌ స్థాయిలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున ముంతాజ్ అలి, టిఆర్ఎస్ తరపున
బక్క పిచ్చయ్య ,
బిజెపి పార్టీ నుండి లింగస్వామి ,
సిపిఎం తరపున సైదులు,
టిడిపి నుండి తేలు అన్నరవి,
ఎం ఐ . ఎం . నుండి . హశం
బి ఎస్ పి తరఫున రవిశంకర్, ఎన్నికల విభాగం డిటి సందీప్, వంశీ ,తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.