మెట్రో న్యూస్,:
హిందూ ధర్మంలో ప్రతి హిందువు సంవత్సరానికి ఒక్కసారైనా యజ్ఞం వ్రతం నిర్వహించాలని వేదాలు చెబుతున్నాయని ఏ హోమము, వ్రతాలు చేయలేని భక్తజనులు, పేదల కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ బాల మానస మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ సద్గురు భవాని స్వామీజీ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యర్రం శెట్టి ఉపేందర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహా యజ్ఞం కు సంబంధించిన వివరాలను స్వామీజీ వెల్లడించారు. యజ్ఞ యాగాదుల ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆ ఖర్చులను భరించలేక యజ్ఞాలు యాగాదులు కుంటుపడుతున్నాయని అన్నారు. సమాజ శ్రేయస్సు కోరి మానవ కర్మలను తొలగించేందుకు గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస పరిరజాకాచార్యులు శ్రీ శ్రీ సుదర్శన ఆశ్రమ స్వామిజి ఆశీస్సులతో 1008 మంది దంపతులచే మొట్టమొదటిసారిగా 2012లో లక్ష్మీనారాయణ యాగం, 2015లో రెండవసారి శ్రీ చక్ర మహా యజ్ఞం, మూడవసారి 2020లో శ్రీ మానసా దేవి మహా యజ్ఞం, నాలుగవసారి శ్రీ మహా మృత్యుంజయ పశుపతాత్ర మహాయాగం, ఐదవ సారి 2024లో మహా లలిత యజ్ఞం, ఆరవసారి 2025లో ధన్వంతరి సహిత హనుమాన్ మహా యజ్ఞం, ఏడవసారి 2026 లో రాజ శ్యామల మహా యజ్ఞం, ఎనిమిదవ సారి 2026లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మహా యాగము నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం తొమ్మిదవ సారి డిసెంబర్ 1, 2026 లో 1116 మంది దంపతులచే శ్రీ రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల నగర్ రోడ్ నెంబర్ 24, 100 ఫీట్ల కలెక్టరేట్ రోడ్ అమ్మ గార్డెన్ ఎదురుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఈ యజ్ఞంలో పాల్గొనేలా కేవలం 1516 రూపాయలు చెల్లించి హోమంలో పాల్గొనే అవకాశాన్ని తమ ట్రస్టు కల్పిస్తుందన్నారు. ధనవంతులు ఎలాగైనా యజ్ఞలు యాగాలు చేయగలుగుతారని పేదవాళ్లు అవి చేయలేరని ప్రతి పేదవానికి అందుబాటులో యజ్ఞంలో పాల్గొనేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవంబర్ 30న జరిగే గణపతి, అమ్మవారి ఆగమనం, గణపతి పూజ పుణ్యాహవాచనం, మండప స్థాపన కలశ స్థాపన పంచగవ్య ప్రాశస, అగ్ని మదనం, సహస్ర మోదక గణపతి హోమం, చండీ హోమం, మంగళహారతి తీర్థప్రసాద వితరణ, డిసెంబర్ 1న మంగళవారం జరిగే కాలభైరవ స్వామి ఆవాహనం విశేష పూజ, కాలభైరవ హోమం, విశేష ఆశీస్సులు మహా పూర్ణాహుతి, మంగళహారతి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ జహీర్, నాయకులు సలిగంటి వీరేందర్, యర్రంశెట్టి ఉపేందర్ తులసి, సంకురిశెట్టి పరమేష్ సబిత, ప్రసాదు, వాసుదేవరావు సరళ, ఆనందరావు అనిత, శ్రీనివాస్ రెడ్డి ఉమా, సంజీవరెడ్డి ఉదయ శ్రీ ,శ్రీనివాస్ రెడ్డి పద్మ , రాంరెడ్డి రమ, వెంకట్ రెడ్డి కళావతి, శ్రీనివాసరావు శిల్ప, లక్ష్మారెడ్డి సంధ్య, ట్రస్టు సభ్యులు జెట్టి రవికుమార్, రాజిరెడ్డి, శ్రవణ్ కుమార్, క్రాంతికుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.