హైదరాబాద్ : మెట్రో న్యూస్
ఢిల్లీ నిరసన కార్యక్రమానికి ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై ఆగ్రహంవ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రైల్వే జనరల్ కార్యాలయం ఎదుట బుధవారం మెరుపు ధర్నా నిర్వహించింది ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ ఎంపీలు,వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ రఘురామ్ రెడ్డి ఎమ్మెల్యే లు నవీన్ యాదవ్, శ్రీ గణేష్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే, ప్రత్యేక రైళ్ల కేటాయింపునకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిరాకరించడంతో కాంగ్రెస్ నాయకులు ఈ ఆందోళనకు దిగారు ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే, రైల్వే శాఖ నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.