Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ తరలిన ఆశా కార్యకర్తలు

0 26

మెట్రో న్యూస్ 

ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి సదస్సుకు వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నియోజకవర్గ 24 పి.హెచ్.సి ఆశాలు జిల్లా అధ్యక్షురాలు కలువాల లలిత ,జిల్లా కార్యదర్శి గోలి సంధ్య నాయకత్వంలో తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు మాట్లాడుతూ ఆశాలకు 18 వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి నెల ఒకటో తేదీన వేతనం ఇవ్వాలని ఏ ఎన్ సి టార్గెట్ ను ఎత్తివేయాలని జాబ్ చార్ట్ లో ఉన్న పనులను మాత్రమే ఆషాలతో చేయించాలని డిమాండ్ చేశారు. వీటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే నవంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సంఘం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తంగెళ్ల సుజాత పిట్టల శ్రీలత సృజన ప్రమీద శోభ అనిత సునీత రూపిక జ్యోతి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.