Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

0 2

నిన్న అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాల నేపథ్యంలో స్పీకర్ ను కలిసిన పరామర్శిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం.

అసెంబ్లీ తొలి రోజు (సోమవారం) అసెంబ్లీ ఆవరణలో అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు.

మహిళా అధికారుల ఎదుట అంగీలు విప్పుకొని అనుచితంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావు, కేటీఆర్ .

బీఆర్ఎస్ నాయకులు ఏకంగా స్పీకర్ గారిని అసభ్యకర పదజాలంతో దూషించి.. మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా వ్యవహరించారు.

అసెంబ్లీ ఎదుట జరిగిన ఈ దురదృష్టకర పరిణామాలపై పత్రికలు, టీవీలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయి. తనను వ్యక్తిగతంగా దూషించటంతో స్సీకర్ గారు కంట తడి పెట్టుకున్న దృశ్యాలు చూసి ముఖ్యమంత్రి గారు ఆవేదన చెందారు.

మంగళవారం అసెంబ్లీకి రాగానే స్పీకర్ గారి ఛాంబర్ కు వెళ్లిన సీఎం ఆయనను పరామర్శించారు. స్పీకర్ గారిని ఓదార్చారు. నిన్న జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని స్పీకర్ గారికి తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.