మెట్రో డిజిటల్ న్యూస్.
జనాభా గణన–2027లో భాగంగా గణన బ్లాకులు, ఉప గణన బ్లాకులను పటిష్టంగా ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు సూచించారు. ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జనాభా గణన 2027 రెండవ దశకు సంబంధించి గణన బ్లాకులు, ఉప గణన బ్లాకుల ఏర్పాటుపై నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనాభా గణనలోని 40 ప్రశ్నలు, స్వీయ గణన, సీఎంఎంఎస్ పోర్టల్‌పై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌లోని జనాభా గణన సంచాలకుల కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు యువేందర్ బాబు, నాయుడు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్, ఆర్డీఓ కృష్ణవేణి, ఛార్జ్ అధికారులైన తహసీల్దార్లు, అదనపు ఛార్జ్ అధికారులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ముఖ్య ప్రణాళిక అధికారి బి. జవహర్ లాల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, గణాంక అధికారులు భూక్యా లాల్ నాయక్, ఎం. రమేష్ బాబు, ఈడీఎం దేవేందర్ పాల్గొన్నారు.