Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నాం : మంత్రి శ్రీధర్‌బాబు

0 3

హైదరాబాద్ : మెట్రో న్యూస్
ప్రతిపక్ష నాయకులు కెసిఆర్ చావును ఎవరూ కోరుకొరని వంద ఎళ్ల పైగా అయన బతికుండాలని శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కెసిఆర్ చావును కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను డిమాండ్ చేస్తూ పొడియం వద్ద ఆందోళన చేపట్టారు.దాంతో బీఆర్‌ఎస్‌ ప్రస్తావించాల్సిన అంశాలను స్పీకర్‌కు సరైన రూపంలో ఇవ్వాలని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. అసభ్య పదజాలానికి సంబంధించి సభలో ఆమోదించే ప్రసక్తే లేదన్నారు.

కేసీఆర్‌ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నామన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో సేవ చేయాలని కోరుకుంటామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎవరి చావు కోరుకోదని మంత్రి స్పష్టం చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దళితుల అడుగుపెట్టారానే నెపంతో ఆ స్థలాన్ని పసుపు నీటితో శుద్ధి చేసి అవమానిచడమే కాకుండా న్యాయం కావాలంటున్నారు భట్టి తెలిపారు.నిరసనలో భాగంగా దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. పసుపు నీటితో శుద్ధి చేసి అవమానిచడమే కాకుండా న్యాయం కావాలంటున్నారని మండిపడ్డారు.

బలహీనవర్గాలు, దళిత, గిరిజనులకు న్యాయం కావాల్సిందన్నారు. విపక్ష నేతల ఆగడాలు, అవమానాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోందని భట్టి తెలిపారు. సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ బీఆర్‌ఎస్‌ నేతలు చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అవమానాలను కొనసాగించే పరిస్థితి మానుకోవాలని కోరుతున్నానన్నారు. సభాపతి సూచన చేస్తే వాదన పెట్టుకోకుండా సజావుగా నడిచేలా చూడాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.