- నిముషాల్లోనే 100 శాతం సబ్‌స్క్రిప్షన్
- రూ.30,213 కోట్ల ఐపీఓతో
- జియో ప్లాట్‌ఫామ్స్ సంచలనం
ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికాం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ ప్రారంభమైన రెండు గంటల్లోపు 100 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదుచేసింది. బుధవారం నాడు మొత్తం రూ.30,213 కోట్ల విలువైన ఈ ఆఫర్‌ను మదుపరులు ఓవర్ సబ్‌స్క్రైబ్ చేశారు. సాయంత్రానికి 300 శాతం దాటడం విశేషం. వాస్తవానికి ఈ ఐపీఓకు ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024లో హ్యుండాయ్ ఇండియా నమోదు చేసిన రూ.27,870 కోట్ల రికార్డును బ్రేక్ చేస్తూ భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది.
ఈ జియో ఐపీఓకు అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో ఏడీఐఏ, బ్లాక్‌రాక్ వంటి గ్లోబల్ ఫండ్‌లు సహా అనేక ప్రధాన సంస్థలు పోటీపడి రూ.25 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ విలువైన బిడ్లను దాఖలు చేశాయి. ఐపీఓ ప్రారంభమైన మొదటి రోజే బిడ్డింగ్ రికార్డు స్థాయిలో సాగడం సంచలనం. షేర్ల కేటాయింపు ఈనెల 26న ఉండనుంది. ఈనెల 28న స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయిన తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీల జాబితాలో నిలవనుంది.