Take a fresh look at your lifestyle.

ఫ్యూచ‌ర్ సిటీ పోలీస్ కమిష‌న‌రేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

0 42
  • జాతీయ ప‌ట్ట‌ణ నిర్వ‌హ‌ణ
    సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం నాడు ఫ్యూచ‌ర్ సిటీకి సంబంధించి రెండు కీల‌క సంస్థ‌ల‌కు ప్రారంభోత్స‌వం, శంకుస్థాప‌నలు చేశారు. సీఎం మొద‌ట ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను, పోలీస్ క‌మిష‌న‌ర్ త‌రుణ్ జోషి కార్యాల‌యాన్ని ప్రారంభించారు. శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి భారత్ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సంద‌ర్శించారు. అక్క‌డ జ‌రుగుతున్న నిర్మాణాల‌ను ఇత‌ర ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. డిసెంబ‌రులో జ‌ర‌గ‌బోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ గురించి క‌మిష‌న‌ర్ శ‌శాంక‌తో చ‌ర్చించారు. అనంత‌రం జాతీయ ప‌ట్ట‌ణ నిర్వ‌హ‌ణ సంస్థ (ఎన్‌.ఐ.యు.ఎం) క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చివ‌ర‌గా ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో సమీక్ష నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.