Plane Crash : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శిక్షణ విమానం హఠాత్తుగా కూలిపోయింది. రెండు ఇంజిన్లు, నాలుగు సీట్లతో ఉన్న విమానం ఒక్కసారిగా గంగాన తీరానికి సమీపంలో పడిపోయింది.

Plane Crash : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శిక్షణ విమానం హఠాత్తుగా కూలిపోయింది. రెండు ఇంజిన్లు, నాలుగు సీట్లతో ఉన్న విమానం ఒక్కసారిగా గంగాన తీరానికి సమీపంలో పడిపోయింది. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దూర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు ట్రైనీ పైలట్, మరొకరు శిక్షకుడు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. .
కాన్పూర్‌లో శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. గురువారం ఉదయం గంగానది తీరం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. విమానం ప్రమాదం గురించి తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతులను సచిన్ భాటియా(గుజరాత్), అభిషేక్ పుజారి(కర్నాటక)గా గుర్తించారు. కాన్పూర్ గార్గ్ ఏవియేషన్ అకాడమీ నుంచి ఉదయం 11:30 సమయంలో సచిన్, అభిషేక్ శిక్షణ విమానంలో బయల్దేరారు. అయితే.. 20 నిమిషాల్లోనే గంగానది సమీపంలో వీరి ఫ్లయిట్ కుప్పకూలిందని పోలీసులు పేర్కొన్నారు.
ఇన్‌స్ట్రక్టర్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన 3వేల గంటలు విమానం నడిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని డీజీసీఏ తెలిపింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు.. ఘటనా స్థలంలోకి ఎవరినీ అనుమతించలేదు. అత్యవసర సేవలు, అధికారుల బృందం పరుగున ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లింది’ అని కాన్పూర్ నగర్ ఎస్పీ రఘువీర్ లాల్ వెల్లడించారు.
అయితే.. ఈ విమానాన్ని కేంద్రం 2023లో కొనుగోలు చేసిందని సమాచారం. కానీ, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను మాత్రం సీపీ చెప్పలేదు. విమాన ప్రమాదంలో మృతి చెందిన పైలట్ కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంఘీభావం తెలిపారు.