Take a fresh look at your lifestyle.

ప్రజలు, ఉద్యోగులు మీ ఉద్యోగాలు ఊడగోడుతారు చూస్కో సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు చుర‌క‌

0 16

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

విద్యుత్ సంక్షోభానికి మీ చేతగానితనమే కారణం అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నిందించారు. విద్యుత్ అధికారులపై నెపం నెట్టడంపై బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు. తప్పు మీరు చేసి, అధికారుల మీద నెపం నెట్టడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారింది. బొగ్గు నిల్వలు కూడా పెట్టుకోకుండా విద్యుత్ సంక్షోభానికి కారణమైంది మీరు. సమీక్షలు కూడా చేయకుండా, విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేసి, కరెంట్ కోతలకు కారణం అయ్యింది మీరు. ఇప్పుడు నింద మొత్తం అధికారుల మీద వేసి, మీరు సుద్ధపూసలా మాట్లాడుతారా? అని గురువారం నాడు ఎక్స్ వేదిక‌గా మాజీ మంత్రి కామెంట్ చేశారు.

9 నెలలుగా ఎల్‌నినో ప్రభావం గురించి వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. కానీ మీరు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు నిద్ర లేచి అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని విమ‌ర్శించారు. నిషేధిత భూముల జాబితాలో తప్పు చేసింది మీ ప్రభుత్వమే. కానీ అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కరెంట్ సంక్షోభం విషయంలోనూ మా తప్పేం లేదు, అంతా అధికారులదే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు అంటున్నారు. ఈ రెండింటికంటే మించిన విపత్తు మీ పాలన అని ఎందుకు గుర్తించడం లేదు? అధికారుల ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తున్నావు.. ప్రజలు, అధికారులు నీ ఉద్యోగం ఊడగొట్టకుండా చూసుకో రేవంత్! అంటూ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.