Take a fresh look at your lifestyle.

పొంచి ఉన్న ప్రమాదం – కూలిపోనున్న విద్యుత్ స్తంభాలు, పట్టించుకోని అధికారులు

0 5

మెట్రో న్యూస్:
మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామ శివారులో ‍మాచర్ల ఆదిత్య వరి పొలాల వద్ద కట్ట ప్రక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంటు స్తంభాలు పూర్తిగా వంగి ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది. స్తంభానికి తీగలపై తీగలు చుట్టుకుని, పిచ్చి మొక్కలు అల్లుకుపోయి ఉన్నాయి.
వర్షాల కారణంగా పొలాల్లోకి ఈ స్తంభాలు నుండి విద్యుత్ ప్రవహిస్తే రైతులకు, పశువులకు ప్రాణాపాయం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వందల మంది రైతులు,ఈ దారి గుండానే పొలాలకు వెళ్తున్నారు.ఇప్పటికైన విద్యుత్ అధికారులు స్పందించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతుల డిమాండ్:

వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి, వంగిన స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేయాలి.
ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, నిర్వహణ చేపట్టాలి.

తీగలు వేలాడకుండా సరిచేయాలి.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందే చర్యలు తీసుకోవాలని‌ విద్యుత్ ఉన్నతాధికారులను రైతులు కోరుతున్నారు..

రైతుల ఆవేదన – “ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలం వెళ్తున్నాం”

ఈ స్తంభలు ఇలా వంగి 2 సంవత్సరాలు అవుతోంది, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కరెంటు వచ్చి మా మీద పడుతుందో అని భయం భయంగా పొలానికి వెళ్తున్నాం. అధికారులకు చెబితే ‘చూస్తాం, చేస్తాం’ అంటున్నారు తప్ప ఎవరూ రావడం లేదు.
లోడంగి శంకర్ రైతు

“వరి చేనుకు నీరు పెట్టడానికి వెళ్తే కాలువ నీటిలో కరెంటు వస్తుందేమోనని భయం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, నేల అంతా తడిగా ఉంది. ఈ తీగ తెగి పడితే మొత్తం పొలంలో కరెంటు పాకుతుంది. పశువులు కూడా అటే వెళ్తున్నాయి. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత?” –

మునుకుంట్ల వీరస్వామి రైతు

“ట్రాన్స్‌ఫార్మర్ కింద పిచ్చి చెట్లు పెరిగి దాన్ని కూడా కనిపించకుండా కప్పేశాయి.
కానీ మా ప్రాణాలకు రక్షణ లేదు. దయచేసి జిల్లా కలెక్టర్, ఎస్ఈ జోక్యం చేసుకుని వెంటనే మరమ్మతులు చేయించాలి.

Leave A Reply

Your email address will not be published.