Take a fresh look at your lifestyle.

బకాయిల బరువు కింద – బతుకులు నలగకూడదు,… విజేత కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ

0 26

మెట్రో న్యూస్

ఫీజు బకాయిల బరువు కింద బతుకులు నలగకూడదని విజేత కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే విషయంలో సిపిఐ శాసనసభా పక్ష నేత కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును తమ కళాశాల బృందంతో కలిసి కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అలసత్వం వలన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల కాక
కొలువులు దూరమవుతవున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వారిఆశలు కూలిపోతున్నాయని చమటోడ్చిన తల్లిదండ్రుల – కష్టం నీరుగారిపోతుందని చదువుకునే పసి మనసులు నైరాశ్యం చెందకుండా ఉండకుండా, యాజమాన్యాలు అప్పుల కోరల్లో చిక్కకుండా, అధ్యాపకుల జీవితాలు రోడ్డన పడకుండా ఉండాలంటే బకాయిలు సకాలంలో విడుదల చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరామన్నారు. ఈ సందర్భంగాసిపిఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు స్పందించి డిగ్రీ, పిజి కళాశాలల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మధు, పాపయ్య,హరి, వీరయ్య బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.