Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

0 51

(మెట్రో ఈవినింగ్):

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేస్తూ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు.
గృహ నిర్మాణ శాఖ పనుల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్‌ లతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్షించారు.
జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన నివేదికలను నిర్దేశించిన నమూనాలో వాస్తవ సమాచారంతో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వాస్తవ వివరాలు సమర్పించకుండా నిర్లక్ష్యం వహిస్తే సమీక్షలు కొనసాగించడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో పథకం అమలుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారో స్పష్టంగా నిర్ధారించుకొని, ప్రతి అధికారి తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
మండల స్థాయిలో ఎంపీడీవోలదే పూర్తి బాధ్యత :
మండల స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఎంపీడీవోలు పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హౌసింగ్ ఏఈలు ఎంపీడీవోల సమన్వయంతో పనిచేయాలని, సర్వే వివరాల సేకరణ, నివేదికల సమర్పణ, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అర్హులైన దరఖాస్తులను ఎల్-1 జాబితా లోకి తీసుకురావాలి :
ఎల్-1 జాబితాలోని దరఖాస్తులను గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతను నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్-2 జాబితాలోని దరఖాస్తుదారుల అర్హత, భూమి పత్రాల లభ్యతను పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు సమన్వయంతో పరిశీలించి, అర్హులైన వారిని నిబంధనల ప్రకారం ఎల్-1 జాబితాలోకి తీసుకురావాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.