Take a fresh look at your lifestyle.

ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర

0 15

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • రైతు డిస్కం జీవోను
    తక్షణం ఉపసంహరించుకోవాలి
  • మాజీ మంత్రి హరీశ్ రావు

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో17 జారీ చేయడాన్ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవో జారీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనం. ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర? వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటు అన్నారు. సర్కార్ నిర్వాకంతో అన్న‌దాత మరింత ఇబ్బందుల్లో ప‌డతార‌న్నారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం.. పగటిపూట మాత్రమే విద్యుత్ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందా? అని అనుమానం వ్య‌క్తం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, 24 గంటల సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వగలదా? రైతుల అనుమానాలను నివృత్తి చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడం కుదరదు. రైతుల ప్రయోజనాలే లక్ష్యమైతే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి ఎందుకు ముందుకెళ్తున్నారు? ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పకుండా చాటు మాటుగా జీవో జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? రైతులకు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల్లో అనుమానాలు, ఆందోళనలు ఎందుకు పెంచుతోంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.