హైదరాబాద్ (మెట్రోన్యూస్):
కోర్టు ఆదేశాల మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటును ఖాయం చేస్తూ.. అసెంబ్లీ గెజిట్ నోటీఫికేషన్ విడుదల చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి గెజిట్‌ను విడుదల చేశారు. హైకోర్టు తీర్పును అనుసరించి, 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అనర్హత అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేయడం గమనార్హం. ఎప్పుడైతే ఎంపీ సీటుకు నామినేషన్ వేశారో… ఆ తేదీ నుంచే ఎమ్మెల్యేగా దానం అనర్హుడైనట్టు హైకోర్టు ఆదేశాలివ్వడం తెల్సిందే. గెజిట్ విడుదలవ్వడంతో… ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఆరునెలలోపు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.