ప్రపంచంలోని ప్రాచీన సూర్యారాధనా క్షేత్రాల్లో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం అత్యంత ప్రసిద్ధమైనది. 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవుడు- కాలంలో నిర్మితమైన ఈ ఆలయం, భారతీయ శిల్పకళా వైభవానికి అద్భుత నిదర్శనం. 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ఆలయం నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
కోణార్క్ను చూస్తే ముందుగా కనిపించేది ఒక మహా రథం. సూర్యభగవానుడి రథాన్ని ప్రతిబింబించేలా ఆలయాన్ని రూపొందించారు. ఇరువైపులా 24 భారీ రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లు ఏడు గుర్రాలు చెక్కబడి ఉంటాయి. ప్రతి చక్రంపై అత్యంత సూక్ష్మమైన శిల్పాలు, అలంకరణలు కనిపిస్తాయి. ఈ చక్రాలు కాలచక్రానికి, ఋతువులకు, నెలలకు ప్రతీకలుగా భావించబడుతున్నాయి. నినిఆలయ గోడలపై దేవతలు, నర్తకులు, సంగీతకారులు, జంతువులు, పుష్పాలు, సామాజిక జీవన దృశ్యాలు వంటి అనేక శిల్పాలు చెక్కబడ్డాయి.
అందువల్ల ఇది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; ఆ కాలం నాటి ప్రజల సామాజిక, సాంస్క ృతిక, కళా జీవనానికి రాతిలో చెక్కిన చరిత్రగా నిలిచింది.నినిఒకప్పుడు ఆలయ ప్రధాన శిఖరం కూడా ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఉండేది. కాలక్రమంలో అది ధ్వంసమైనప్పటికీ, మిగిలిన నిర్మాణాలు అప్పటి శిల్పుల అపూర్వ ప్రతిభను నేటికీ చాటుతున్నాయి. ఆలయ నిర్మాణానికి వేలాది మంది శిల్పులు, కళాకారులు కృషి చేశారనే సంప్రదాయ కథనాలు కూడా కోణార్క్ వైభవాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. నినికోణార్క్ ప్రత్యేకత కేవలం దాని వాస్తుశిల్పంలోనే లేదు. భారతీయ సంస్క ృతిలో సూర్యుడు జీవశక్తికి, ఆరోగ్యానికి, కాలానికి, క్రమశిక్షణకు ప్రతీక. ఆ సూర్యుడినే ఒక మహారథంగా మలచిన కోణార్క్, మన పూర్వీకుల ఆధ్యాత్మిక దృష్టితో పాటు ఖగోళ అవగాహన, గణిత నైపుణ్యం, నిర్మాణ శాస్త పరిజ్ఞానాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.నినిఅందుకే కోణార్క్ను ఒక ఆలయంగా మాత్రమే చూడటం తక్కువే. కాలాన్ని రాతిలో బంధించిన భారతీయ మేధస్సుకు అది శాశ్వత సాక్ష్యం.