Take a fresh look at your lifestyle.

దానంపై సుప్రీం నిర్ణ‌యం రాజ్యాంగ విజ‌యం

0 25

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ విజయం అని బిజెపి శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బిజెఎల్పి చేసిన న్యాయపోరాటం వల్లే ఈ విజయం దక్కిందన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో న్యాయపోరాటం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తాం అని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుపై ఏలేటి స్పందిస్తూ… ఫిరాయింపుల నిరోదక చట్టాన్ని అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం కంచే చేను మేసిన వైనాన్ని తలపించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడిన సీఎం, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తోటి రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలి. అస్తమానం రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఇతర పార్టీ ఎమ్మెల్యేకు తన పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం, ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనడానికి నిదర్శనం అని విమ‌ర్శించారు.

Leave A Reply

Your email address will not be published.