Take a fresh look at your lifestyle.

నూతన సబ్ కలెక్టర్ సలోని చాప్రాకు అచ్చంపేట బీజేపీ నాయకుల శుభాకాంక్షలు.

0 3

మెట్రో న్యూస్:

అచ్చంపేట పట్టణానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ శ్రీమతి సలోని చాప్రాను బుధవారం అచ్చంపేట బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సబ్ కలెక్టర్ సలోని చాప్రాకు అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం పలికారు. అచ్చంపేట ప్రాంత అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి బీజేపీ తరఫున సహకరిస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.