Take a fresh look at your lifestyle.

మహిళా సాధికారతకు జాతీయ స్థాయి గుర్తింపు: మంత్రి సీతక్క

0 39

సీడ్ క్యాపిటల్‌లో తెలంగాణకు ప్రథమ బహుమతి

మహిళా సాధికారతకు జాతీయ స్థాయి గుర్తింపు: మంత్రి సీతక్క

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్):

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకంలోని సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్‌ను స్వయం సహాయక సంఘాలకు సమర్థవంతంగా అందించడంలో తెలంగాణ రాష్ట్రానికి “బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ – ఫస్ట్ రన్నర్ అప్” అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో మంగ‌ళ‌వారం నిర్వహించిన నేషనల్ కాన్‌క్లేవ్–2026లో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా తెలంగాణ తరఫున సెర్ప్ డైరెక్టర్ (ఫామ్) ఎన్. రజిత ఈ అవార్డును అందుకున్నారు.

ఈ జాతీయ అవార్డు మహిళా సంఘాలను కేవలం పొదుపు, రుణాలకే పరిమితం చేయకుండా, వారికి మూలధనం అందించి ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానానికి దక్కిన గుర్తింపు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు, సెర్ప్ అధికారులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ఒక శాఖకు లేదా కొంతమంది అధికారులకు మాత్రమే దక్కిన గౌరవం కాదని, రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యుల కృషి, సెర్ప్ సిబ్బంది క్షేత్రస్థాయి శ్రమ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయానికి లభించిన గుర్తింపు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.