Take a fresh look at your lifestyle.

మాధవనగర్ ఆర్వోబీ వద్ద బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం

0 11

నిజామాబాద్, నవంబర్ 5( మెట్రోన్యూస్ )

నగర శివారులోని
మాధవనగర్​ ఆర్వోబీ వద్ద రూరల్​ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గురువారం రూరల్​ బీఆర్​ఎస్​ ఇన్​ఛార్జి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాజిడ్డి జగన్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ 2015‌‌–16లో బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలోనే రైల్వే ఓవర్​ వంతెన కోసం 60శాతం నిధులు మంజూరయ్యాయన్నారు.కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ నిధుల సమీకరణలో తీవ్రంగా కృషి చేసి సాధించారన్నారు. అప్పటి ఎంపీ కవిత హయాంలో ఈ నిధులు వచ్చాయన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్​ ,బీజేపీ ఆర్వోబీని తామే సాధించాయని గొప్పలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారన్నారు.
ఆర్వోబీకీ బీజం పడిందే బీఆర్​ఎస్​ హయాంలో అని ​ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాజిరెడ్డి రమాకాంత్​, తిర్మల్​ పటేల్​, పద్మారావు, కోర్వ దేవేందర్​, అజయ్​,మల్లెపూల నరసింహ చారీ,రంగా, బంటు దాస్​, ఖానాపూర్​ హరి, బట్టు సంజయ్​ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.