హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్చార్జీల పేర్లను ప్రకటించారు. ఈ మేరకు 6 జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను ప్రకటించారు. ఖమ్మం–వరంగల్–నల్గొండ, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా సంబంధిత నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను కేటీఆర్ ఇన్‌చార్జీలకు అప్పగించారు.